శ్రీశైలం వెళ్లే భక్తులకు అప్రమత్తం

 


కడలి న్యూస్:- ఆంధ్రప్రదేశ్ లోని  శ్రీశైల మల్లన్న భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు హెచ్చరించారు. ఇటీవల పలువురు నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవడంతో ఆలయం ఈవో శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. వసతి, దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను అధికారిక వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలన్నారు. www.srisailamdevasthanam.org, www.aptemples.ap.gov.in , దేవాదాయ శాఖ వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలన్నారు. దేవస్థానం వివరాలకు 83339 01351, 52, 53 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

కామెంట్‌లు