జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా తెలుగు భాష సేవా పురస్కారం అందుకున్న దుబ్బ భాస్కరరావు

 



కడలి న్యూస్:-
తెలుగు భాష సేవా పురస్కారం 2025 అవార్డును  జేడీ లక్ష్మీనారాయణ చేతులమీదుగా శ్రీకాకుళం జిల్లా పెద్ద పద్మపురం గ్రామానికి చెందిన దుబ్బ భాస్కరరావు అందుకున్నారు.  ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భముగా పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, కోటపాటి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో నిర్వహించిన తెలుగు భాషా పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలుగు భాషా సేవా పురస్కారం 2025 పురస్కార గ్రహీత దుబ్బ భాస్కరరావుకు డి లక్ష్మీనారాయణ ఈ అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి డాక్టర్ బూర్గుల మధుసూదన్ రావు, డాక్టర్ రాధాకుసుమ, నిర్వాహకులు కే మురళీమోహన్ రాజు, కె. మురళి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోఆర్డినేటర్ వి వి మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు