పిల్లలను దండించే అధికారం గురువులకు లేదా?
1990, 2000లలో గురువులంటే పిల్లలకు ఎంతో గౌరవం, భయం ఉండేవి. పిల్లలు సరిగా చదవకున్నా, అల్లరి చేసినా మందలించమని తల్లిదండ్రులు టీచర్లకు చెప్పేవారు. వారి భరోసాతో ఉపాధ్యాయులు విద్యార్థులను దారిలోకి తెచ్చి మంచి పౌరులుగా తీర్చిదిద్దేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిల్లలపై చేయి వేద్దామంటేనే ఉపాధ్యాయులు జంకాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులకూ పిల్లలపై నియంత్రణ ఉండట్లేదు. మీ కామెంట్?