కడలి న్యూస్ విద్య ఉద్యోగ వార్తలు
దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల్లో 18,147 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (CGL) ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. SSC జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ సాగిస్తే తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు పోటీ పడవచ్చు. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టులకు స్టాటిస్టిక్ ఒక సబ్జెక్టు డిగ్రీలో చదివి ఉండాలి. రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్షలో విజయం సాధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు.
అన్ని పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లు. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు 32ఏళ్లు, గ్రూప్-C పోస్టులకు 27ఏళ్లు ఉండాలి.
రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ఇప్పటినుంచే దీనిపై దృష్టిపెట్టడం మంచిది. ఈనేపథ్యంలో SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 పరీక్ష విధానం, సిలబస్, ఎలా ప్రిపరేషన్ కావాలో తెలుసుకుందాం..
పరీక్ష విధానం
SSC CGL ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు దశల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు.
టైర్-1: ఇందులో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్(25 ప్రశ్నలు), జనరల్ అవేర్నెస్ (25 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(25ప్రశ్నలు), ఇంగ్లిష్ కాంప్రహెన్షన్(25ప్రశ్నలు) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు.
టైర్-2: టైర్1లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు. టైర్-2 మొత్తం 3 పేపర్లలో జరుగుతుంది. అన్ని పోస్టులకు అభ్యర్థులు పేపర్-1 పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలి. పేపర్-2 జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టుల అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది. పేపర్-3ని అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల అభ్యర్థులకు నిర్వహిస్తారు.
పేపర్-1 సెక్షన్-1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 30, రీజనింగ్ & జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు 3 మార్కుల చొప్పున 180 మార్కులకు ఈ సెక్షన్ ఉంటుంది. సెక్షన్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి 45, జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కుల చొప్పున 70 ప్రశ్నలకు 210 మార్కులు. పరీక్షా సమయం గంట. సెక్షన్-3 మాడ్యుల్-1లో కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. వీటికి 60 మార్కులు. పరీక్షా వ్యవధి 15 నిమిషాలు. అన్ని సెక్షన్లలోనూ ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. సెక్షన్-3 మాడ్యుల్ 2లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ 15 నిమిషాల వ్యవధితో నిర్వహిస్తారు. ఇచ్చిన సమాచారాన్ని 15 నిమిషాల్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే చాలు. పేపర్-2లో స్టాటిస్టిక్స్ 100 ప్రశ్నలు 200 మార్కులు కేటాయించారు. పరీక్షా వ్యవధి 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి అరమార్కు తగ్గిస్తారు. పేపర్ - 3లో జనరల్ స్టడీస్(ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్) 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది.
ఏం చదవాలి?
రెండు దశలుగా జరిగే పరీక్షలో పలు సెషన్స్, మాడ్యూల్స్లో ఆయా సబ్జెక్టులలో జరిగే పరీక్షల్లో విజయానికి అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా ప్రిపరేషన్ కావాలి.
రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్: ఇందులో అభ్యర్థులు రాణించాలంటే కోడింగ్, డీ కోడింగ్, అనలిటికల్ పజిల్స్, క్రిటికల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ అక్షర క్రమాన్ని ముందు నుంచి వెనకకు, వెనక నుంచి ముందుకు ప్రాక్టీస్ చేయాలి. ఏ అక్షరం ఏ స్థానంలో ఉందో సులువుగా గుర్తించాలి. అనలిటికల్ రీజనింగ్, సిలాజిజమ్, సీక్వెన్స్, పజిల్స్, క్లాక్, క్యాలెండర్, రక్త సంబంధాలు, దిక్కుల గురించి అవగాహన పొందాలి.
జనరల్ అవేర్నెస్: జనరల్ స్టడీస్లో రాణించేందుకు హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అంశాలపై పట్టు సాధించాలి. స్టాక్ జీకేపైనా అవగాహన పెంచుకోవాలి.
క్వాంటిటేవ్ ఆప్టిట్యూడ్: టెన్త్ మ్యాథ్స్ ని ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. అర్థమెటికకు సంబంధించి పర్సంటేజ్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్, ప్రాఫిట్-లాస్, సింపుల్- కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ వర్క్, టైమ్ డిస్టెన్స్, పర్ముటేషన్స్-కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, పార్టనర్షి ప్పై దృష్టి పెట్టాలి. భాగాహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను నోటితో గణించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తుంచుకోవాలి.
ఇంగ్లిష్ కాంప్రహెన్షన్: బేసిక్ గ్రామర్పై అవగాహన పెంచుకోవాలి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్, స్పెల్లింగ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, వొకాబులరీ, రీ రైటింగ్ ద సెంటెన్స్, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ప్రెసిస్ రైటింగ్ నేర్చుకోవాలి.
డేటా ఇంటర్ప్రైటేషన్: టేబుల్స్, చార్ట్లు, గ్రాఫ్ ద్వారా సమాచారమిస్తూ ప్రశ్నలు అడిగే విభాగం ఉంది. డేటా ఇంటర్ప్రైటేషన్ ప్రశ్నలను సాధించాలంటే పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోలపై అవగాహన ఉండాలి. వివిధ రకాల గ్రాఫ్ ను సాధన చేయాలి. ఈ విభాగంలో పట్టు కోసం టేబుల్స్, బార్ చార్ట్స్, పైచార్ట్స్ ప్రాక్టీస్ చేయాలి.
కంప్యూటర్ నాలెడ్జ్: కంప్యూటర్ ఫండమెంట్స్, బేసిక్ కంప్యూటర్స్ ట్రక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్, ఇంటర్నెట్, సాఫ్ట్వేర్ కాన్సెప్టే, డీబీఎంస్, ఎంఎస్ ఆఫీస్లకు సంబంధించి బేసిక్ టెర్మినాలజీపై పట్టు సాధించాలి. సిస్టమ్కు సంబంధించి హార్డ్వేర్ టూల్స్, వాటి ఉపయోగాల గురించి అవగాహన పెంచుకోవాలి.
పేపర్ 2, పేపర్ 3లో రాణించేందుకు అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో అకడమిక్ పుస్తకాలను అధ్యయనం చేయాలి. అదేవిధంగా గత ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లను సాధన చేయాలి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 350 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 350 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు మార్చి 24వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, సీఏ, ICWA, సీఎఫ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు 21 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. దరఖాస్తు ఫీజు జీఎస్టీతో కలిపి రూ.1180, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు జీఎస్టీతో కలిపి రూ.59 చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్షలో రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ గురించి ప్రశ్నిస్తారు.
www: https://www.pnbindia.in/
బయోటెక్నాలజీ ఎలిజిబిలిటి టెస్ట్ కు దరఖాస్తుల స్వీకరణ
బయోటెక్నాలజీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించే బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 కు NTA దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు మార్చి 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1300, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. సీబీటీ విధానంలో 300 మార్కులకు మే 13న పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంవీఎస్సీ, ఎంఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో కనీసం 60శాతం మార్కులు సాధించి ఉండాలి.
www : https://exams.nta.ac.in/
స్కాలర్షిప్ కు అప్లై చేసుకున్నారా?
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈ బీసీ, దివ్యాంగ విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్స్కు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. పరీక్షల హడావుడిలో పడి దరఖాస్తు చేయడంలో నిర్లక్ష్యం చేస్తే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రాక తల్లిదండ్రులపై ఆర్థికభారం పడవచ్చు. కావున ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. డిసెంబర్ 31తోనే దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ.. అప్లికేషన్లు తక్కువ రావడాన్ని గుర్తించిన అధికారులు అందరూ దరఖాస్తు చేసుకోవాలనే ఉద్దేశంతో అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
www:https://telanganaepass.cgg.gov.in/