యువత ఆశపడుతున్నది... రాష్ట్ర ప్రజలు చంద్రబాబునాయుడు నుంచి కోరుకుంటున్నది ఇదే


కడలి న్యూస్:-
రాష్ట్ర ప్రజలు కూటమికి అనూహ్య తీర్పు ఇవ్వడంతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి  అధికారాన్ని చేజిక్కించుకున్నారు.  దేశంలో విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయం జగమెరిగిన సత్యం.  కానీ రాష్ట్ర విభజన తరువాత 2014లో తమను అభివృద్ధి పథంలో నడిపిస్తాడని ప్రజలు ఎన్నో ఆశలతో చంద్రబాబు నాయుడికి  అధికారం అందజేస్తే... చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను  ఎలాగైనా ఉన్నత స్థానంలో కూర్చో పెట్టేందుకు సీనియర్ నాయకుల కంటే కుమారుడు లోకేష్ కే అధిక ప్రాధాన్యత ఇచ్చి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలతో పాటు  చంద్రబాబు నాయుడు కూడా కష్ట నష్టాలు పడ్డారు.  సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు వారసత్వంగా లోకేష్ కు ముందుకు తేవాలి అనే ఆశతో లోకేష్ మార్కు పాలన నాడు సాగించారు. లోకేష్ పిల్ల చేష్టలతో చేసిన పొరపాట్ల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర నష్ట పోయారు. వీటిలో ముఖ్యమైనది లోకేష్ మంత్రిగా కొనసాగిన ఐటీని అభివృద్ధి చేయాక పోగా ఉన్న వాటిని లోకేష్ స్తంభింపజేశాడు. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు అప్పట్లో లోకేష్ కి ఎటువంటి అర్హతలు లేకున్నప్పటికీ ఎమ్మెల్సీగా ఎంపిక ఐటీ శాఖ మంత్రిగా పదవిని కట్టబెట్టారు. ఈ విషయంపై టిడిపి సీనియర్ నాయకులు లోలోన ఇబ్బంది పడినా బయటకు చంద్రబాబును ఎదిరించే సాహసం చేయలేదు. అలా అధికారాన్ని కైవశం చేసుకున్న లోకేష్ ఇష్టారాజ్యంగా అప్పటికే విశాఖలో అప్పుడప్పుడే కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ సంస్థలను విశాఖ నుంచి మంగళగిరికి తరలించే ప్రయత్నం చేశారు. ఇదే ఆయన చేసిన అతి పెద్ద తప్పు. ఈ ఆలోచన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అది తమ కమ్మ కులస్తులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే అంతా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో లోకేష్ చేసిన ఈ తప్పు వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర నష్టపోయారు. ఈ విషయంలో చంద్రబాబు కూడా మెతక వైఖరి కనపరిచాడని మేధావులు బావన. చంద్రబాబు తన ఆలోచనలకు విరుద్ధంగా ఆనాడు కులం, కుమారుడు నిర్ణయాలకు తలొగ్గటం వల్ల నేడు ఆయనతో పాటు రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం ఇబ్బందులకు గురైయ్యారని  మేధావులు అంటున్నారు.

  ఈసారి కూడా రాజధాని అభివృద్ధి పేరుతో కేవలం అమరావతి ప్రాంతాన్ని మాత్రమే చంద్రబాబు అభివృద్ధికి కృషి చేస్తారని ప్రచారం సాగుతుంది. అయితే ఈసారైనా చంద్రబాబులో మార్పు రావాలని సమంజసంగా పాలన సాగించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమానంగా కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రానికి రాజధాని ఉండాలి కానీ అక్కడ మహానగరం ఉండాలని ప్రజలు కోరుకోవడంలేదు. చంద్రబాబు అనుకున్నట్లే రాజధాని అమరావతిలో కొనసాగిస్తూనే... అన్నిటికన్నా ముఖ్యమైన  రాష్ట్రంలోని యువతకు  ఉద్యోగ, ఉపాధి  అవకాశాలు కల్పించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రాజధాని అభివృద్ధికి ప్రజలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. కానీ తమ పిల్లల భవిష్యత్ కోసం... నిరుద్యోగ నిర్మూలన కోసం రాష్ట్రంలో ఐటీతో పాటు, భారీ కంపెనీలు నెలకొల్పేలా చంద్రబాబు కృషి చేయాలని ఆశిస్తున్నారు. ఇదే ఆశతో రాష్ట్ర విభజన తరువాత 2014లో చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇస్తే రాజధాని పేరుతో కేవలం అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నిధులు తరలించి భారీ భవంతులతో ఆకాశమంత రాజధాని నిర్మిస్తున్నాం అంటూ అక్కడ నిర్మిస్తున్న భవంతుల ఫోటోలు చూపిస్తూ ప్రచారం చేయడం ప్రజలకు నచ్చలేదు. అలాగే అన్ని వసతులు ఉన్న అందమైన విశాఖలో ఐటీ అభివృద్ధికి కృషి చేయకుండా తనయుడు లోకేష్ చెప్పిన విధంగా దానిని మంగళగిరికి మార్చడంతో విశాఖలో సాఫ్ట్వేర్ అభివృద్ధి ఆగిపోవడమే కాకుండా సరైన వసతులు లేని మంగళగిరికి ఐటీ సంస్థలు రావడానికి ఇష్టపడలేదు. 

సాగర తీర ప్రపంచ ప్రసిద్ధ మహా నగరం విశాఖ నగరం. ఐటీ సంస్థల అభివృద్ధికి పుష్కలమైన వసతులు ఉన్న ఈ నగరానికి వెళ్లి రావడానికి విమాన, రైలు మార్గాలతో పాటు ఓడరేవు కూడా ఇక్కడ ఉంది. అంతే కాకుండా ఈ నగర సమీపంలో ఐటీ సంస్థలు స్థాపించడానికి తాము సానుకూలంగా ఉన్నామని అప్పట్లో విశాఖలో జరిగిన సదస్సులో పలు ఐటీ  సంస్థల దిగ్గజాలు తెలిపారు.  కానీ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న చంద్రబాబు తనయుడు లోకేష్ చెప్పిన విధంగా మంగళగిరికి ఐటీ తరలించాలని నిర్ణయం కారణంగా అక్కడ తమ సంస్థలు నెలకొల్పడానికి ఐటీ కంపెనీలు యజమానులు ఇష్టపడలేదు. అయినా పట్టుబట్టి ఎలాగైనా మంగళ గిరి ప్రాంతంలోనే ఐటీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో లోకేష్ చేసిన ప్రతిపాదనతో చంద్రబాబు మంగళగిరిలో ఐటీ అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంగళగిరిలో ఐటీ అభివృద్ధి చెందక పొగా విశాఖలో ఉన్న సాఫ్ట్వేర్ అభివృద్ధి పూర్తిగా మందగించింది.  రాజధాని అమరావతి దానికి ఆనుకుని ఉన్న మంగళ గిరి ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అప్పట్లో మేధావులు చెప్పిన విషయాన్ని ప్రజలు గ్రహించారు. చంద్రబాబు కులం మత్తులో పడి ఆ ఒక్క ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేయాలని ప్రయత్నించడం ఫలితంగా నేడు రాష్ట్రం వెనుకబడి పోయింది అనే విషయం ప్రజల్లో బాగా నాటుకుపోయి ఉంది. నాడు చంద్రబాబు నాయుడు విశాఖలో ఐటీ అభివృద్ధికి కృషి చేసి ఉంటే ఈ రోజు రాష్ట్రాభివృద్ధి మరో విధంగా ఉండేది. జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా రాజధానిలో భారీ భవనాల నిర్మాణం కంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు జీవనం ముఖ్యం అనే విషయం ప్రభుత్వంలోని పెద్దలు గుర్తించి చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం విశాఖలో ఐటీ అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రజలు తమ పిల్లలు తమకు అందుబాటు దూరంలో ఉండాలని కోరుకుంటున్నారు.  అలాగే రాష్ట్రంలోని యువత మన రాష్ట్రంలోనే ఉంటూ అన్ని వసతులు ఉన్న విశాఖలాంటి ప్రాంతంలో ఉద్యోగం చేయాలనే ఆశతో ఉన్నారు. వారి ఆశలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి.  గతంలో  చంద్రబాబు నాయుడు  తన కులం పెద్దలు.. తన కుమారుడు లోకేష్ చెప్పిన విధంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతంలో తమ కులస్తులు ఎక్కువుగా ఉన్న ప్రాంతంలో అభివృద్ధికి  కుట్ర చేశాడని గ్రహించిన ప్రజలు... చంద్రబాబుపై  వ్యతిరేకతతో అవినీతి ఆరోపణల్లో పూర్తిగా కూరుకుపోయి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అధికారం అందించారు.  ప్రజలు ఇచ్చిన ఈ సదవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. విశాఖను రాజధానిగా ప్రకటించి ఈ ప్రాంతాన్ని దోచుకున్నాడు. కానీ విశాఖలో ఐటీ అభివృద్ధికి కృషి చేసి ఉంటే ఈ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఎన్నికల ఫలితాలు వేరేలా ఉండేవి. జగన్ రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి  సంక్షేమ పథకాల పేరుతో జనానికి లక్షలాది రూపాయలు అందజేసి అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజావ్యతిరేక పాలన సాగించాడు. అంతేకాకుండా జగన్ పెట్టిన ఇబ్బందులకు కాకావికలమై తాను మారిపోయాను అవకాశం కల్పిస్తే ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలన సాగిస్తాను అంటూ చంద్రబాబు నాయుడు చెప్పారు. అప్పటికే రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టిన జగన్ ను  వ్యతిరేకిస్తున్న ప్రజలు చంద్రబాబు చెప్పిన మాటలు విని మరోసారి చంద్రబాబుకు ప్రజలు రికార్డు స్థాయిలో  మెజారిటీ సీట్లతో అవకాశం కల్పించారు. అధికారం చేపడుతున్న చంద్రబాబు ప్రజలకు కావలసింది గుర్తించి పాలన సాగించాలి. 

రాష్ట్ర ప్రజలకు ప్రస్తుతం కావలసింది తమ బిడ్డల భవిష్యత్ కు ఆధారమైన ఉద్యోగాలు, ఉపాధి కల్పన.  అటువైపుగా వేగంగా అభివృద్ధి చెందాలంటే విశాఖలో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేయాలి. అలా కాకుండా తమ కులస్తులు ఎక్కువుగా ఉన్న ప్రాంతంలోనే అన్నీ అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రజలు తీవ్ర నష్టపోతారని మేధావులు అంటున్నారు. 

 చంద్రబాబునాయుడు తనకు మారుడు లోకేష్, అలాగే తన కులం పెద్దలు చెప్పిన విధంగా మంగళగిరిలో ఐటీ కాకుండా రాజధానిని అమరావతిలో కొనసాగిస్తూ...   అత్యవసరంగా  యువతకు అవసరమైన ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ముందుగా విశాఖలో ఐటీ అభివృద్ధికి  చంద్రబాబు నాయుడు కృషి చేయాలని ఆశిద్దాం.

మేధావులైన పాఠకులు ఈ సందేశంతో ఏకీభావిస్తే... చంద్రబాబు నాయుడితో పాటు ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు చేరేలా షేర్ చేయాలని మనవి.

కామెంట్‌లు