నెల్లిమర్లను మోడల్ సిటీగా మార్చడమే ధ్యేయం - నెల్లిమర్ల అసెంబ్లీ జనసేనా అభ్యర్థి లోకం మాధవి




కడలి న్యూస్ :- నెల్లిమర్లను మోడల్ సిటీగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తనను ఓటుతో దీవించాలని తెలుగుదేశం, బిజెపి, బలపరచిన జనసేనా నెల్లిమర్ల ప్రజలను లోకం మాధవి విజ్ఞప్తి చేశారు. నెల్లిమర్ల జనసేన, టీడీపీ, బీజేపీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి లోకం మాధవి ఉత్తరాంధ్ర కు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి కోసం 1994 లో భర్త లోకం ప్రసాద్ తో కలిసి మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థని విజయనగరంలో ఏర్పాటుచేశారు. మిరాకిల్ సంస్థ ద్వారా 3 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించారు. అదేవిధంగా ఈ ప్రాంత విద్యార్థులకు నైపుణ్యమైన విద్యను అందించేందుకు 2009లో మిరాకిల్ ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించి అత్యాధునిక కోర్సులని అందిస్తున్నారు.

2019లో జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయినప్పటికీ ఇంటింటికి జనసేన కార్యక్రమాలను కొనసాగించి అక్రమ నిర్మాణాలు అరికట్టడంలో పాటు కలుషిత నీరు, మిమ్స్ ఉద్యోగులు, సిపిఎఫ్ ఆక్వా పరిశ్రమ కార్మికుల, మత్స్యకార గ్రామాల, భోగాపురం భూ సమస్యలపై పోరాటం సాగిస్తూ వస్తున్నారు. రైతు సమస్యలపై పల్లెలో రైతు గర్జన, గిట్టుబాటుధర, మత్యకార సమావేశాలు, యువకెరటం, మహిళా శక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం సాగిస్తున్నారు. అలాగే మిచాంగ్ తుఫాను, అకాల వర్షాల బాధిత రైతులను మాధవి పరామర్శించి సొంత నిధులతో ఆర్థిక సాయంచేసి ఆదుకున్నారు.

అంగన్వాడి వర్కర్ల సమ్మెకు మద్దతుగా ఒకరోజు గౌరవ వేతనంగా 4 లక్షలు, మిమ్స్ ఉద్యోగుల ధర్నాకు మద్దతుగా 1 లక్ష విరాళం, ప్రభుత్వ స్పందనలేని లంకపేట ఏటి ఒడ్డు రోడ్డుకు మరమత్తులు వంటి అనేక సేవా కార్యక్రమాలు లోకం మాధవి చేపట్టారు.
వీటితో పాటుతన సొంత నిధులతో దాదాపు 300 మంది పేద విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్, స్కాలర్షిప్లు లు అందజేశారు. కలుషిత నీరు ప్రభావిత మత్స్యకార గ్రామాలకు వాటర్ ట్యాంక్తో నీళ్లు సరఫరా, కంటకాపల్లి రైలు ప్రమాద క్షతగాత్రుల బాగోగులు చూసి ఉచిత మందులు ఇచ్చి గమ్యస్థానాలకు చేర్చాడంలో లోకం మాధవి చొరవ అభినందనీయం. నెల్లిమర్ల నియోజకవర్గంలో దేవాలయాల నిర్మాణాలు మరమత్తులకి 10 లక్షలు పైగా, హాస్పిటల్స్ కోసం మరో రెండు లక్షలు, జి చోడవరం గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి విరాళాలు ఇవ్వడమే కాకుండా దగ్గరుండి ప్రతిరోజూ పనులు పర్యవేక్షించారు.

పారిశ్రామిక అనుభవంతో చంపావతి నది నీళ్లను పంటలకు మళ్లించి, పరిశ్రమలతో 61% నిరక్షరాస్యత రూపుమాపి మహిళా సాధికారతతో నెల్లిమర్లను మోడల్ సిటీగా మార్చడమే ధ్యేయంగా పనిచేసిన తనను ఓటుతో దీవించాలని నెల్లిమర్ల ప్రజలను లోకం మాధవి విజ్ఞప్తి చేశారు.
కామెంట్‌లు