ముస్లింలలో 100కి 99శాతం మంది కష్టపడటానికి ఇష్టపడతారు. ముస్లింలలో మేధాశక్తి అమోఘం.. ముస్లింలకు చట్ట సభల్లో స్థానం కల్పించాలి

ముస్లిం సోదరుల్లో 100 కి 99 శాతం మంది కష్టపడి పని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. 

  . రోజంతా కష్టపడటానికి ఇష్టపడతారు. 

. ముస్లింల మేధా శక్తి అమోఘం.

*ముస్లింలలో 100కి 99 శాతం మంది కష్టపడటానికి ఇష్టపడతారు.*

*ముస్లిం సోదరులకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యతనిచ్చి చట్ట సభల్లో స్థానం కల్పించాలి* 

*ఈ ఎన్నికల్లో ముస్లింల ఎజెండా*

కడలి న్యూస్,విశాఖపట్నం :-  ముస్లిం సోదరులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో లక్షల సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయంగా ఎదిగేందుకు పార్టీలు అవకాశం కల్పించడం లేదు. ఎన్నికల సమయాల్లో మాత్రమే ఎక్కడలేని ప్రేమ వలకబోస్తు రాజకీయ నాయకులు ముస్లిం సోదరుల చుట్టూ.. మస్జీద్ ల  చుట్టూ తిరుగుతూ ఓట్లు దండుకుని మళ్ళీ ఐదేళ్ళ వరకు కనిపించరు. ముస్లిం సోదరులు ఏదైనా సమస్యపై ఆయా నాయకుల్ని  కలిసేందుకు వారి ఆపీసుకో.. ఇంటికో వెళ్ళినా... ఆ నాయకుడు తన పిఏలతో లేరని చెప్పిస్తూ ఉంటారు. ఇది మారాలి. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, నాయకులు ముస్లిమ్ సోదరులు సమాజానికి చేస్తున్న సేవలు గుర్తించాలి. 

ముఖ్యంగా విశాఖ ముస్లింల గురించి అందరికీ ఈ  సందర్భంగా తెలియజేసేది ఏమనగా 

 ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం మంది ముస్లింలు కళ్లద్దాలు షాపులు నిర్వహిస్తున్నారు. వీరు ఉదయం 9 గంటలకు షాపుకి వెళ్లి రాత్రి 10 గంటల వరకు షాపులోనే నిరీక్షించి కళ్ల సమస్యతో డాక్టర్ వద్దకు వెళ్లి వచ్చే బాధితులకు కావలసిన అద్దాలు అనగా కళ్ళు బాగా కనిపించేలా కళ్లద్దాలు తయారు చేసి అతి తక్కువ అంటే వందల్లోనే రుసుము తీసుకుని బాధితులకు చూపు బాగా కనిపించేలా చేసే గొప్ప సేవకులుగా ఉన్నారు.

 అలాగే  ముస్లిం సోదరులు టైర్లకు పంచర్లు వేసేవారు, పుట్ పాత్ లపై బట్టలు, బ్యాగ్ లు, చెప్పులు, బెల్ట్ లు, టోపీలు, ఇలా చిన్న చిన్న వ్యాపారాల ద్వారా ప్రజలకు కావలసిన వస్తువులు  సరసమైన ధరలకు విక్రయస్తూ ముస్లిం సోదరులు సమాజానికి సేవ చేస్తున్నారు.

 మరి కొంత మంది ముస్లింలు సోదరులు బ్యాటరీ షాపులు, మెకానిక్ లుగా  కొనసాగుతూ... ఇంజనీర్లు సైతం చేయలేని పనులు కూడా కనీస చదువు లేని కొంత మంది ముస్లిం సోదరులు సునాయాసంగా పరిష్కరిస్తూ ఉంటారు. ముస్లింల మేధా శక్తి అమోఘం. వారికి అవకాశం కల్పిస్తే ఎంతటి మెకానికల్ సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తారు. 

అలాగే భారీ ఖర్ఖానాలకు కావలసిన అన్ని రకముల ఐటమ్స్ విశాఖకు తెచ్చి సరసమైన ధరలకు విక్రయిస్తూ స్థానిక కర్మాగారాల అభివృద్ధికి ఒక రకంగా కృషి చేస్తున్నారని చెప్పాలి.  

అలాగే ఆహార తయారీలో వారికి వారే సాటి ముస్లిం సోదరులు చేసే వంటకాలు రుచికరంగా ఉంటాయి. వారు నిర్వహించే చిన్న చిన్న రోడ్డు సైడ్ దుకాణాల నుంచి రెస్టారెంట్ల వరకూ ప్రజల ఆకలి తీరుస్తూ భోజన ప్రియులకు మంచి రుచికరమైన ఆహారాలను అందజేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు.

 కొంతమంది కొంచం ఉన్నతంగా ఉన్న ముస్లిం సోదరులు ప్రపంచ ప్రఖ్యాత మిల్లుల నుంచి బట్టలు సేకరించి స్థానిక ఉన్నత కుటుంబ వర్గాల ప్రజలకు విక్రయిస్తూ సేవ చేస్తున్నారు. 

కొంతమంది టైలరింగ్ లలోనూ తనదైన ప్రత్యేకత చాటుతూ ప్రజలకు కావలసిన విధంగా బట్టలు కుట్టి సేవ చేస్తున్నారు. కొంతమంది విద్యాలయాలు స్థాపించి సేవ చేస్తున్నారు.

 ముస్లింలలో ఇటీవల డాక్టర్ల సంఖ్య బాగా పెరిగినా... స్వాతంత్ర్యానికి ముందునుంచి తమ సేవలు అందిస్తునారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆరీఫ్ ఆసుపత్రి లాంటివి స్థాపించి ప్రజలకు అధునాతన వైద్యాన్ని అందిస్తున్నారు. విశాఖలో మొట్ట మొదటి ప్రవేట్  ఆసుపత్రి సాయిబ్ గారి ఆసుపత్రి ప్రస్తుత ఆరిఫ్ హాస్పిటల్ అనే విషయం ఎంతమందికి తెలుసు. ప్రస్తుత డాక్టర్ అస్లాం ఆరీఫ్ ప్రతీ ఏడాది జరిగే సింహాద్రి గిరి ప్రదక్షిణ భక్తులకు ఉచితంగా సేవలు చేస్తున్న విషయం ఎంతమందికి తెలుసు.  

అలాగే ప్రతీ ఇంటికి కావలసిన వంట ఇంటి సామాగ్రి దుకాణాలు ముస్లిం సోదరులు నిర్వహిస్తూ దేశ విదేశాల నుంచి వస్తువులు సేకరించి ఈ ప్రాంత ప్రజలకు అందజేసి సేవ చేస్తున్నారు. 

మరికొంత మంది ముస్లిం సోదరులు నాణ్యమైన గృహ సముదాయాలు నిర్మించి గూడు లేని వారికి సరసమైన ధరలకు ఇల్లు అందజేస్తూ సేవ చేస్తున్నారు.  

 కొంతమంది ఇల్లును పరిసరాలను శుభ్రం చేసే క్రిమి సంహరిక బ్లీచింగ్, మందులను విక్రయిస్తూ సేవ చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ముస్లిం సోదరులు పాత బడిన, ఎందుకూ పనికి రాని రోడ్లపై పడి ఉన్న ప్లాస్టిక్  తుప్పు పట్టిన ఇనుప ముక్కలు, పాతబడిన వాహనాలు, వస్తువులు సేకరించి సమాజాన్ని శుభ్రం చేస్తూ సేవ చేస్తున్నారు. 

అలాగే ముస్లిమ్ సోదరులలో చాలామంది న్యాయవాదులు, ఇంజనీర్లు, టెక్నాలజీ వస్తు విక్రేతలుగా తమ తమ వృత్తుల్లో అంకితభావంతో సేవలందిస్తున్నారు.  

ఇలా చెప్పుకుంటూ పోతే ముస్లిం సోదరుల్లో 100 కి 99 శాతం మంది సేవా గుణం, అంకిత భావంతో కష్టపడి పని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. రోజంతా కష్టపడటానికి ఇష్టపడతారు. అలాంటి ముస్లిం సోదరులకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తే ప్రజా సేవలో తమ వారసత్వ సేవా గుణాన్ని అమలు చేసి దేశాన్ని, ప్రజలను ముందుకు నడిపిస్తారు.  అవకాశం కల్పిస్తే ఒక ఉన్నత విలువలు కలిగిన రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మాదిరిగాను.. దేశంలో ఇప్పటికీ అమలవుతున్న విద్య వ్యవస్థ స్థాపకుడు మొట్ట మొదటి భారత దేశ విద్యా శాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మాదిరిగా సేవలు అందించగలరు. ఇప్పటికే క్రికెట్ లాంటి క్రీడల్లో ముస్లిం యువకులు తమ సత్తా చాటుతున్నారు. కొంతమంది యువకులు అవకాశాలు లేక క్రీడలకు దూరమవుతున్నారు. అలాగే విద్యలో రాణిస్తున్నప్పటికీ స్తోమత లేక ఉన్నత విద్యను అభ్యసించలేక ముస్లిం యువతీ యువకులు సాధారణ పౌరులుగా కొనసాగుతున్నారు. ఇవన్నీ పరిష్కారం కావాలంటే ముస్లింల సమస్యలు తెలిసిన ముస్లింలు రాజకీయంగా ఎదగాలి చట్ట సభల్లో ముస్లింల గొంతు వినిపించాలి. దానికి రాజకీయ పార్టీలు ముస్లింలకు అవకాశం కల్పించాలి.

ముస్లిం సోదరులకు  కష్టపడి సాధించడం తప్ప..అర్ధించడం అలవాటు లేదు. దీని వల్ల కూడా ముస్లిం సోదరులు రాజకీయంగా ముందుకి రాలేకపోతున్నారు.  ఈసారైనా గట్టి పట్టు పట్టి ఈ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఈ ప్రాంత ముస్లిం సోదరులకు కనీసం జిల్లాకు ఒకరికి చెప్పున్న  ఎమ్మెల్సీలుగా ముస్లిం సోదరులను ఎంపిక చేసేలా పార్టీల మేని పెస్టోలో చేర్చే పార్టీకే తమ మద్దతు అని ముస్లింలంతా ఏకంగా ప్రకటించాలి. 

ఇదే సమయంలో ముస్లిం సోదరులలో మార్పు రావాలి. మనకెందుకు రాజకీయాలు అనుకోకుండా రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలి.



కామెంట్‌లు