నవరాత్రి రెండోరోజు : సమస్త మనోవికారాలు తొలిగి నిత్యసంతోషం కొరకు బాలాత్రిపుర సుందరీ దేవిని పూజించండి అమ్మవారి అలంకారం..పూజావిధి!


తెలుగు రాష్ట్రాలతో
 పాటు దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 
రెండో రోజు.. 
ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపుర సుంద‌రీదేవి  రూపంలో దర్శనమివ్వనున్నారు. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి.. పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు. అమ్మ‌వారికి ఆకుప‌చ్చ‌, ఎరుపు, పసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెల‌ను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు

​రెండో రోజు- బాలాత్రిపుర సుందరీ


దేవినవరాత్రుల్లో  రెండో రోజు చంద్ర ఘాంట రూపం అలంకరణ శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి. ఈరోజు అమ్మవారిని తుమ్మిపూలతో అలంకరించాలి. పాయసాన్ని నైవేద్యంగా అందించాలి. అలాగే ఈరోజు దేవికి లేతగులాబీ రంగు చీరను కట్టించాలి. బాలాత్రిపుర సుందరీదేవిని పూజించడం వల్ల సద్బుద్ధి, కార్యాసిద్ధి కలుగుతుంది. ఈ రోజు రవికలను దానం చేయడం చాలా మంచిది. దేవీ నవరాత్రుల్లో రెండో రోజు పటించాల్సిన మంత్రం..

ఐం క్లీం సౌ సౌక్లీం ఐం నమః
తరువాత అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుతూ కుంకుమ పూజ చేస్తే.. చాలా మంచిది. 
శ్లోకం: హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌!!
రెండో రోజు పరాశక్తి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజచేస్తారు. త్రిశతీ పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి.
మనస్సు అమ్మవారి మీద పెట్టాలి. అమ్మవారి ప్రవచనాలు ఎన్నో అందుబాటులో ఉంటాయి. వాటిని పటించవచ్చు. ఈ విధంగా అమ్మవారి నవరాత్రులు చేసుకంటే మీ జీవితం ఎంతో ఆనందంతోపాటు ఏ సమస్యలు లేకుండా ఉంటాయి. ఆ అమ్మవారిని కరుణ మీపై ఉంటుంది.
శరన్నవరాత్రుల్లో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది.
త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి. అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే.. మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపురసుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందీదేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందీదేవి భక్తుల పూజలందుకుంటోంది.
ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి.
 ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి పాయసం నివేదన చెయ్యాలి. త్రిశతీ పారాయణం చెయ్యాలి.
బియ్యం లేదా సేమియాలతో చేయబడు ఒక వంటకం. పాలను బాగుగా కాచి వాటిలో ముందుగా సిద్దం చేయబడిన బియ్యం/సేమియా, జీడిపప్పు, యాలకులు, మెదలగునవి వేసి మరింత మరగబెట్టాలి.

రెండో రోజు- అమ్మ బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు.
బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారు..
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపురతాపినీ ఉపనిషత్తు చెబుతోంది. ‘స్వర్గ, భూ, పాతాళం’ అనే త్రిపురాల్లో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు. శ్రీచక్రంలో ఉండే తొమ్మిది అమ్నయాల్లో మొదటి అమ్నయం త్రిపురసుందరీదేవియే. ‘శ్రీ’ విద్యలో మొదటి విద్య బాల అందుకే ఆధ్యాత్మిక విద్యను సాధన చేసేవారు మొదట బాల మంత్రాన్ని ఉపాసన చేస్తారు.

మంత్రం :
అరుణ కిరణ జాలై రంజితా సావకాశా
విదృత జపతటీకాపుస్తకాభీతిహాసా,
ఇతర వరకారాఢ్యా పుల్లకల్హాలసంస్థా
నివసతు హృదిబాలా నిత్యకళ్యాణశీలా
బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారిని ధ్యానించడంతో సమస్త మనోవికారాలు తొలిగి నిత్యసంతోషం కలుగుతుందని భక్తుల నమ్మకం. బాలాత్రిపుర సుందరీ దేవిని అరుణవర్ణ వస్త్రాలు ధరించి ఎర్రని పూలతో పూజ చేస్తారు.

కామెంట్‌లు